హయర్‌ ఆఫీసులపై ఐటీ దాడులు

నవతెలంగాణ – న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ గృహోపకరణాల తయారీ సంస్థ హయర్‌ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. ఢిల్లీ, ముంబై, నోయిడా, పుణేతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రాంతాల్లోని హయర్‌ ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నారు. చైనాకు చెందిన ఈ సంస్థ పెద్ద మొత్తంలో పన్నులు ఎగ్గొడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కంపెనీ కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. గృహోపకరణాల మార్కెట్‌లో హయర్‌ అప్లయన్సెస్‌ ఇండియా (హయర్‌ ఇండియా) గ్లోబల్‌ లీడర్‌గా దూసుకుపోతున్నది. వరుసగా 14 ఏండ్లుగా ప్రపంచ నంబర్‌ 1 బ్రాండ్‌గా నిలుస్తున్నది. దేశంలో వినియోగదారుల కోసం ఎన్నో వినూత్నమైన ఉత్పత్తులను అందిస్తున్నది.

Spread the love