నాయకులతో కిటకిటలాడిన జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణం

నవతెలంగాణ- ఆర్మూర్:  పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణం గురువారం రాత్రి నాయకులతో కిటకిటలాడింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ సంబరాలు పూల పండగ వాతావరణాన్ని తలపించాయి.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తో పాటు బీ ఆర్ ఎస్ నాయకులు పండిత్ ప్రేమ్,  ఆలూర్ సర్పంచ్ కళ్లెం మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ దమ్మాజీ శ్రీనివాస్, చేపూర్, ఖానాపూర్ సర్పంచులు ఇందూరు సాయన్న, సింగిరెడ్డి మోహన్ తదితరులు పాల్గొన్నారు.