నవతెలంగాణ-జగిత్యాల: తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ‘మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సవాల్ విసిరారు. మద్యం, డబ్బు పంచకుండా ఎన్నికల్లో పోటీ చేస్తావా. తెలంగాణ తల్లి మీద ప్రమాణం చేయగలవా. నీ డబ్బు, మద్యం వ్యాఖ్యలు 119 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు వర్తిస్తాయా?. నువ్వు, నీ పార్టీ మద్యం పంచకుండా గెలుస్తుందా?. మేము ప్రమాణం చేస్తాం..నువ్వు కూడా చేస్తావా?.” అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.