
మండలంలోని పసర గ్రామ పంచాయితీ పరిధిలో డిఆర్డిఏ సేల్స్ డిపో నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న జిమ్మ వరలక్ష్మి మంగళవారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఐటీడీఏ పీవో అంకిత్ చేతుల మీదుగా ఉత్తమ సేవ అవార్డు అందుకున్నారు. కాగా గ్రామానికి చెందిన మహిళ మరియు మాజీ సర్పంచ్ అయిన జిమ్మ వరలక్ష్మి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవా అవార్డు అందుకోవడంతో స్థానికులు విస్తృతంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి అవార్డులు ముందు ముందు మరెన్నో అందుకోవాలని గ్రామానికి మండలానికి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి పెట్టాలని కోరుకుంటున్నట్లుగా సోషల్ మీడియాలో అభినందనలు తెలియజేశారు. పసర గ్రామ సర్పంచిగా ప్రజాసేవలో ముందున్న వరలక్ష్మి ప్రస్తుతం తాను నిర్వర్తిస్తున్న విధులలో కూడా చక్కగా రానిచ్చి ఉన్నతాధికారులతో అభినందనలు అవార్డులు అందుకోవడం గర్వించదగ్గ విషయమని పలువురు గ్రామస్తులు తెలుపుతున్నారు.