నవతెలంగాణ – హైదరాబాద్
హైదరాబాద్ వేదికగా శుక్రవారం జరిగిన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్ స్పెక్టకల్ ఫైట్ నగరవాసులతో పాటూ యావత్ భారత ఫైటింగ్ అభిమానులను అలరించింది. స్టార్ ఫైటర్ జాన్ సీన సహా పలువురు డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్లు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత యువత తనపై కురిపించిన అభిమానానికి జాన్ సీన అచ్చెరవొందారు. ‘‘భారత యువత నన్నెంతగానో అభిమానించడం ఆనందంగా ఉంది. హైదరాబాద్‌కు రావడం ఇదేతొలిసారి. పోటీల్లో ప్రతిభ కనబరిచే వారికి భవిష్యత్తు ఉంటుంది’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ నటుడు కార్తి జాన్ సీనను కలిసి ముచ్చటించాడు. ఆయనతో ఓ ఫొటో దిగాడు.