సినీ దర్శకుడిపై 4 సెక్షన్ల కింద కేసు నమోదు

నవతెలంగాణ- హైదరాబాద్: తమిళ సినీ నటుడు, నామ్ తమిళర్ కట్చి పార్టీ కన్వీనర్ సీమాన్ పై చెన్నైలోని వలసరవాక్కం పోలీసులు కేసు నమోదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆ తర్వాత మోసం చేశాడని ఆయనపై నటి విజయలక్ష్మి 2011లో వలసరవాక్కం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అది ఇప్పటికీ పెండింగ్ లో ఉంది. దీంతో ఆమె తాజాగా చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మరోసారి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో 2011లో ఇచ్చిన ఫిర్యాదుతో సీమాన్ పై నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సీమాన్ ను పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేయవచ్చనే ప్రచారం జరుగుతోంది.

Spread the love