బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపుమేరకు కలిసిన కట్టెబోయిన అనిల్ కుమార్

నవతెలంగాణ -పెద్దవూర: హైదరాబాద్ లోని ప్రగతి భవనంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పిలుపుమేరకు నాగార్జున సాగర్ నియేజకవర్గ ఎన్నికల సమన్వయకర్త కడారి అంజయ్య యాదవ్ నేతృత్వం లో ఏకే ఫౌండేషన్ చైర్మన్ బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు కట్టెబోయిన అనిల్ కుమార్ గురువారం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో కలిశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్
విద్యావంతుడికి, పార్టీకోసం సమాజం కోసం పనిచేస్తున్న యువకుడికి మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటుకాగానే పార్టీ పదవుల లో సముచిత స్థానాన్ని కల్పించాలాలని కోరారు. తన సేవలను ఉపయోగించుకుంటామని హామీ ఇస్తూ పార్టీ గెలుపే లక్ష్యం గా కష్టపడి పనిచేసి పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కేటిఆర్ చెప్పరని తెలిపారు. ఈయన వెంట రాష్ట్ర పద్మశాలి సంఘం విద్యావంతుల వేదిక ప్రెసిడెంట్ అలే వెంకట నారాయణ, గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షుడు మన్నెం శ్రీనివాస్ యాదవ్, కోటి తదితరులు వున్నారు.