డ్రోగో డ్రోన్స్‌ నుంచి క్రిషి 2.0

– పురుగు మందులు పిచికారికి ఉపయోగం
హైదరాబాద్‌ : ప్రముఖ డ్రోన్‌ తయారీ, టెక్నాలజీ ప్రొవైడర్‌ డ్రోగో డ్రోన్స్‌ మానవరహిత వైమానిక వాహనం (యుఎవి) క్రిషి 2.0ను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. ఈ డ్రోన్‌ 10 కిలోల పేలోడ్‌ సామర్థ్యంతో రూపొందించబడిందని.. రోజుకు 30 ఎకరాల్లో క్రిమిసంహారక, పురుగు మందులను పిచికారీ చేయగలదని డ్రోగో డ్రోన్స్‌ సంస్థ సిఇఒ యశ్వంత్‌ బొంతు తెలిపారు. వీటిని హైదరాబాద్‌, గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో తయారు చేస్తున్నామన్నారు. ఇది వ్యవసాయ రంగాన్ని శాశ్వతంగా మారుస్తుందని విశ్వసిస్తున్నామన్నారు. నెలకు 200 డ్రోన్‌లను తయారు చేస్తున్నామన్నారు. ఎపిలో 26 సేవా కేంద్రాలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామన్నారు.

Spread the love