ప్రజల సమస్యలపై పోరాడే సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థిని దోనూరి నర్సిరెడ్డిని గెలిపించండి

–  డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్
నవతెలంగాణ-చౌటుప్పల్: మునుగోడు సీపీఐ(ఎం) పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దోనూరి నర్సిరెడ్డి పంతంగి, రెడ్డిబాయి, ఆరెగూడెం గ్రామాలలో గురువారం రెండో రోజు ప్రచారాన్ని కొనసాగించారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి దోనూరి నర్సిరెడ్డిని సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ కోరారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రెండుసార్లు అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నరేంద్ర మోడీ ఆదానీ, అంబానీలకు దేశ సంపదను కట్టబెడుతున్నారని తెలిపారు.ఏటా 2కోట్ల ఉద్యోగాలను ఇస్తామని చెప్పి నిరుద్యోగులను ఉద్యోగాలు కల్పించకుండా మోసం చేశారని ఆయన అన్నారు.ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ గద్దలకు దారాదత్తం చేస్తున్నాడని ఆనగంటి వెంకటేష్ చెప్పారు. కులం పేరుతో మతం పేరుతో విభజన రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటిదాకా ఉద్యోగ ఖాళీలు సరిగా నింపలేదని చెప్పారు. టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు ఇచ్చి ఆయన వ్యక్తులతో పేపర్ లీకేజీ చేసి నిరుద్యోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కేసీఆర్ ను వచ్చే ఎన్నికల్లో బొంద పెట్టాలని ఆయన అన్నారు. హైదరాబాద్ కు కూత వేటు దూరంలో ఉన్న మునుగోడు నియోజకవర్గం అభివృద్ధికి 100 కిలోమీటర్ల దూరంలో ఉందని ఆయన చెప్పారు. పూటకో రంగు రోజుకు పార్టీ మారి ధన రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీ అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి అవకాశవాద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కమిషన్లకు పాల్పడే బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి లను ఓడించి అనునిత్యం ప్రజల మధ్య ఉండే ఎర్రజెండా ముద్దుబిడ్డ సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థి దోనూరి నర్సిరెడ్డి గారి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలకు కోరారు. మునుగోడు సీపీఐ(ఎం) పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దోనూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ చౌటుప్పల్ లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి ఇప్పటిదాకా ఏర్పాటు చేయని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) పార్టీ ఉద్యమాల ద్వారానే ఈ ప్రాంత ప్రజలకు పిలాయిపల్లి కాలువ తెచ్చామనే విషయాన్ని మర్చిపోవద్దని ఇంకా వాటి పిల్ల కాలువలు వేసే వరకు ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉంటామని ఆయన అన్నారు.చౌటుప్పల్ ప్రాంత ప్రజలు నా యొక్క సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను. చౌటుప్పల్ మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, జిల్లా కమిటీ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, ఎండి పాషా, మాజీ సర్పంచ్ చిర్క సంజీవరెడ్డి, అంతటి అశోక్, బోయ నరసింహ, వార్డు సభ్యులు చిర్కా అలివేలు, నాయకులు బోయ నరసింహ, బోయ యాదయ్య ఎస్.కె మదర్, చిట్యాల బుచ్చిరెడ్డి, కడగంచి రాజు, కందాల రవీందర్ రెడ్డి, నందగిరి వసంత, భీమిడి ప్రభాకర్ రెడ్డి, బద్దం అంజయ్య,గుడ్డేటి నరసింహ,నేరె డి మహేష్, రత్నం శ్రీకాంత్, నక్క లింగస్వామి, రాజు పెరియార్,సిద్ధగొని శ్రీకాంత్,రోడ్డ శివకుమార్, సుక్క శ్రీకాంత్, నక్క నాగరాజు, సిద్ధగోని సుశీల, యాదమ్మ, అంజమ్మ, రేష్మ, స్వాతి, సబిత, బోయ సాయికిరణ్, మానస,చింటు తదితరులు పాల్గొన్నారు.