సాహితీ వార్తలు

ఆహ్వానం
ఈ నెల 12వ తేదీ సాయంత్రం 5 గంటలకు హైదారబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ముప్పవరపు వెంకయ్య నాయుడు స్వగృహంలో చెన్నమనేని రంగనాయకమ్మ స్మారక విశిష్టాద్వైత జాతీయ సాహిత్య పురస్కార సభ జరుగుతుంది. ఇందులో ముప్పవరపు వెంకయ్య నాయుడు, రేవూరి అనంత పద్మనాభరావు, శ్రీదేవి మురళీధర్‌, డా||వైష్ణవ వేంకటరమణమూర్తి, గార రంగనాథం పాల్గొంటారు.
పెందోట సాహిత్య పురస్కారాలు
పెందోట సాహిత్య పురస్కారాలకై 2023 సంవత్సరములు ముద్రితమైన 1. పద్య కావ్యాలు, 2. వచన కవిత సంపుటాలు 3. కథా సంపుటాలు 4. బాలకథ సంపుటాలు, 5 బాలగేయ సంపుటాలు, 6. బాల కవిత,గేయ, కథా సంకలనాలను రెండు ప్రతులను ఈ నెల 15వ తేదీలోపు ‘ఇంటి నంబరు 17-128/3, శ్రీనగర్‌ కాలనీ, సిద్దిపేట-502103’ చిరునామాకు పంపాలి. జూన్‌ నెలలో శ్రీ వాణి సాహిత్య పరిషత్‌ పదవ వార్షికోత్సవ సభలో నగదు బహుమతి, శాలువా, ప్రశంసా పత్రం ఇవ్వబడును
– పెందోట వెంకటేశ్వర్లు, 9440524546
గీతమ్‌ పురస్కారం కొరకు…
గీతమ్‌ సంస్థ పన్నెండవ వార్షికోత్సవం సందర్భంగా ఉత్తమ కవితా సంపుటాల పోటీ నిర్వహిస్తున్నారు. అత్యుత్తమ సంపుటికి 10116/- రూపాయలు, జ్ఞాపికతో పురస్కారం వుంటుంది. 2016 నుండి 2024 మధ్య కాలంలో విడుదలైన సంపుటాల 3 కాపీలు ‘అధ్యక్షులు, గీతమ్‌ సాహితీ సంస్థ, పిఠాపురం – 533450’ చిరనామాకు జూన్‌ నెలలోపు పంపాలి. వివరాలకు : 9848398240.