మహాలక్ష్మి పద్మశాలి సంఘం 46వ తర్ప నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ నగరంలోని మహాలక్ష్మి పద్మశాలి సంఘం 46వ తర్ప నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం ఆ సంఘ భవనంలో అట్టహాసంగా జరిగింది..నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కొండ గంగాచరణ్ తో పాటు కార్యవర్గం ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు దీకొండ యాదగిరి హాజరై మాట్లాడుతూ నూతన కార్యవర్గం బందుప్రీతి, రాజకీయాలకతీతంగా సంఘం అభివృద్ధికి కృషి చేయాలన్నారు.ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు..ప్రతి ఒక్కరూ నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని సూచించారు.మహాలక్ష్మి పద్మశాలి సంఘానికి జిల్లా పద్మశాలి సంఘం పక్షాన అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు..జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి పుల్గం హన్మాండ్లు, కోశాధికారి గుడ్ల భూమేశ్వర్, పద్మశాలి ఆత్మీయ సేవా సమితి అధ్యక్షుడు రాపెల్లి గురుచరణ్, మహాలక్ష్మి పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి క్యాతం గంగాధర్, కోశాధికారి చాట్ల రవీందర్, ఉపాద్యక్షులు బత్తుల అశోక్,బిల్ల నారాయణ,బెల్ద సుదర్శన్,సహాయ కార్యదర్శి ఇంజమూరి మధు తదితరులు పాల్గొన్నారు.

Spread the love