తెలంగాణ భవన్‌లో ఘనంగా మహంకాళి ఉత్సవాలు

న్యూఢిల్లీ : లాల్‌ దర్వాజ్‌ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని దేశవ్యాప్తంగా చాటి చెప్పాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇచ్చిన ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ ఉత్సావాల్లో ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథ్‌, ఎంపీలు కె.ఆర్‌ సురేష్‌ రెడ్డి, బోర్లకుంట వెంకటేష్‌ నేత, మన్నె శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ భవన్‌ పరిసరాల్లో జరిగిన బోనాల ఊరేగింపులో వీరు ఉత్సాహంగా పాల్గొన్న అనంతరం అందరూ అమ్మవారికి బంగారు బోనం సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమీషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌, ఓఎస్డీ సంజరు జాజు ఇతర అధికారులు, సిబ్బంది, లాల్‌ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.