ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సును విజయవంతం చేయండి

– చేవెళ్ల నియోజవర్గం మాజీ ఇన్‌చార్జి దేశమల్ల అంజనేయులు, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చేవెళ్ల పార్లమెంట్‌ ఇన్‌చార్జి యాలాల మహేశ్వర్‌రెడ్డి
నవతెలంగాణ-షాబాద్‌
తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సును విజయవంతం చేయాలని చేవెళ్ల నియోజవర్గం మాజీ ఇన్చార్జీ దేశమల్ల ఆంజనేయులు, తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం చేవెళ్ల పార్లమెంట్‌ ఇన్‌చార్జి యాలాలు మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని పీఆర్‌ఆర్‌ మినీ స్టేడియంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభను ఈ నెల 30న చేవెళ్లలో విజయవంతం చేయాలని వాల్‌ పోస్టర్‌ ఆవిష్క రించారు. అనంతరం తెలంగాణ ఉద్యమ కారులు ఇటీవలే మరణించిన ప్రజాగాయకుడు సాయిచంద్‌, షాబాద్‌ మండలం కుమ్మరిగూడకు చెందిన నర్సింహారెడ్డిలకు ఘనంగా నివాళ్లు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన చేవెళ్లలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సును విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి రూ. 10వేల కోట్ల కేటాయించాలన్నారు. నామినేటేడ్‌ పదవులలో ఉద్యమకారులకు ప్రాధాన్యం కల్పించాలన్నారు. ఉద్యమకారులకి పింఛన్‌, ఉచిత బస్సు, ట్రైన్వాసులు, ఆరోగ్యకార్డులు, 300 గజాల ఇంటి స్థలం, వడ్డీలేని రుణాలు ఇవ్వాలన్నారు. తెలంగాణ ఉద్యమకారులను స్వతంత్ర సమర యోధులుగా గుర్తించి గౌరవించాలన్నారు. అన్ని రాజ కీయ పార్టీలు ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉద్యమ సమయంలో పని చేసిన ఉద్యమకారులకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు, దళితబంధు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్‌ ఇబ్రహీం, జిల్లా నాయకులు కుమ్మరి చెన్నయ్య, బేగరి రాజు, జనార్దన్‌, సీతారామరాజ్‌ పాల్గొన్నారు.
షాబాద్‌ మండల తెలంగాణ ఉద్యమకారులు నూతన కార్యవర్గం ఎన్నిక
తెలంగాణ ఉద్యమకారుల సంఘం షాబాద్‌ మండల అధ్యక్షునిగా కుమ్మరి చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి మల్లేష్‌, ఉపాధ్యక్షులుగా సయ్యద్‌ మతీన్‌, సహాయకార్యదర్శిగా శ్రీశైలంయాదవ్‌, తొంట నర్సింహులు, కోశాధికారి కావలి భరత్‌, ప్రచార కార్యదర్శి శివ, మీడియా కార్యదర్శిగా దేశమల్ల శ్రీనివాస్‌, సంస్కతిక కార్యదర్శిగా రమేష్‌, గౌరవ సలహదారులు యాదయ్యగౌడ్‌, మహిళా అధ్యక్షు రాలుగా సయ్యద్‌ గౌసియాబేగం, ఉపాధ్యక్షురాలుగా లక్ష్మీ, కార్యవర్గ సభ్యులు బాల్రాజ్‌ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.