జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయండి..

నవతెలంగాణ – నవీపేట్: వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల ఏడవ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని వీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. మండలంలోని ఫకీరాబాద్ గ్రామంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎంఎస్పి మహాజన సోషలిస్ట్ పార్టీ బోధన నియోజకవర్గం కన్వీనర్ మాణిక్యాల గంగాధర్ మాట్లాడుతూ 7వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాకు మందకృష్ణ మాదిగ హాజరవుతున్నారని వికలాంగులకు 6000 పింఛన్ రోస్టర్ పాయింట్లను 10లోపు చేయాలని వికలాంగులకు ప్రత్యేక సంక్షేమ శాఖను స్వతంత్రంగా ఏర్పాటు చేయాలని జీవో నెంబర్ 34 ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ తో ధర్నా కార్యక్రమం ఉంటుందని అన్నారు. అలాగే ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు జి జి కాలేజ్ ఆడిటోరియంలో ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంఎస్పి మండల కన్వీనర్ ఆకారం రమేష్, సతీష్, పోశెట్టి, సంతోష్, సాయిలు, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love