కాంగ్రెస్ పార్టీలో చేరిన బార్ అసోసియేషన్ సభ్యులు

– కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మేల్యే అభ్యర్థి ఆది శ్రీనివాస్..
నవతెలంగాణ – వేములవాడ కోర్టులో న్యాయానికి ప్రతికైన నల్ల దుస్తులు ధరించి వాదించే న్యాయవాదులు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభసూచికమని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణానికి చెందిన పలువురు బార్ అసోసియేషన్ సభ్యులు మాజీ అధ్యక్షులు పిట్టల మనోహర్, అవధూత రజనీకాంత్, నరాల శ్రీనివాస్, పుప్పాల భాను కృష్ణ, కర్ల శ్రీకాంత్, జెట్టి శేఖర్, దాసరి శ్రీనివాస్, గుండవేని రవీందర్, కోయాల్కర్ శశి, పూర్ణం శెట్టి నాగరాజు, కద్దుల తిరుపతి, సుంకరనేని వంశీకృష్ణ, శ్యామ ప్రశాంత, మొగిలి సుజాత, పిట్టల వెంకటేష్, తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి వేములవాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన బార్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్ కుటుంబ పాలనలో తెలంగాణ పూర్తిగా వెనుకబడిపోయిందని అన్నారు. ఉద్యమ సమయంలో అన్ని వర్గాల ప్రజలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు, ఎందరో అమరులైతే వచ్చిన తెలంగాణను స్వయంగా ఆయనని తీసుకువచ్చినట్లుగా గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమని తెలిపారు. ఒకసారి అవకాశం ఇచ్చి ఆది శ్రీనివాసును భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు. ఈ సందర్భంగా వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ అడ్వకేట్లు కాంగ్రెస్ పక్షాన నిలబడి పార్టీలోకి రావడం చాలా సంతోషదాయకమని అన్నారు. అందుబాటులో ఉండే వ్యక్తిని ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించవలసిందిగా ఆయన ప్రజలను కోరారు.
మీ బిడ్డను మీ పేద బిడ్డను నాలుగు సార్లు ఓడిన ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్న వ్యక్తిని ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించవలసిందిగా అభ్యర్థించారు. నియోజకవర్గ ప్రజలతో ఎప్పుడు మమేకమైతు వారి కష్టసుఖాలను వెన్ను దండగా ఉంటూ వస్తున్నాని ఒక్కసారి అవకాశం ఇచ్చి అసెంబ్లీకి పంపాలని అన్నారు. ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ అభిమానులు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, కౌన్సిలర్ బింగి మహేష్, నాయకులు కూరగాయల కొమరయ్య, చిలుక రమేష్, పుల్కం రాజు, పులి రాంబాబు గౌడ్, బొందిలా మహేష్, వలి, కనికరపు రాకేష్, ముప్పిడి శ్రీధర్, కొలకాని రాజు, నేరెళ్ల శ్రీధర్, తుమ్మ్ మధు గుర్రం తిరుపతి, వస్తాది కృష్ణ ,నాగుల రాము, తోట లహరి, అరుణ్ తేజ చారి, సాయిని అంజయ్య, వరిజే మల్లేశం, తదితరులు ఉన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, నియోజకవర్గంలో ఆది గెలవాలని కోడేముక్కులు చెల్లించిన చెందుర్తి నాయకులు.. చందుర్తి మండలానికి చెందిన సీనియర్ నాయకులు మేకల పరుశురాం ఆధ్వర్యంలో వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యేఅభ్యర్థి ఆది శ్రీనివాస్, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక భారీ మెజార్టీతో గెలవాలని రాజన్న ఆశీస్సులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని , శ్రీనివాస్ గెలవాలని అన్నీ వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని రాజన్న ఆశీస్సులతో రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని కోడెమొక్కులు చెల్లించడం జరిగింది అని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి సలీం, శ్రీకాంత్, చంటి నవీన్, నేదురి రమేష్, నేడురిరాజేష్, శశి, ఎండీ రహీం, బొజ్జ పరుశురాం తదితరులు పాల్గొన్నారు.