అన్నదానంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్ధి మెచ్చా

నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక మద్దిరావమ్మ గుడి సెంటర్లో జరుగుతున్న దశరా నవరాత్రి ఉత్సవాల్లో శనివారం ఎమ్మెల్యే అభ్యర్ధి మెచ్చా నాగేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్ధ ప్రసాదాలు స్వీకరించి అనంతరం అన్నదాన కార్యక్రమానికి హజరయ్యారు. భక్తులకు భోజనాలు వడ్డించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భగవంతుడి ఆశీస్సులు తోనే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో మీరే గెలిచి మరింత అభివృద్ధి సాధించాలని స్థానికులు కోరారు. ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన స్థానికులు శాలువాతో సత్కరించారు. ఆయన వెంట పలువురు టీఆర్ఎస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.
Spread the love