ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయాలి..

– ముదిరాజ్ లకు భేషరతుగా క్షమాపణలు చేప్పలి..
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని వెంటనే అరెస్టు చేసి, ఎమ్మెల్సీ పదవి నుండి తొలగించాలని, ముదిరాజ్ లకు భేషరతుగా క్షమాపణలు చేప్పలని డిమాండ్ చేస్తూ శనివారం ఇందల్ వాయి పోలీస్ స్టేషన్ లో ముదిరాజ్ మండల అధ్యక్షులు మోచ్చె గోపాల్ అధ్వర్యంలో ఎస్.ఐ నరేష్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద రాహదరిపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్దం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజులను ఇష్టం వచ్చిన విధంగా బూతు మాటలు తిట్టినందుకు ముదిరాజ్ జాతికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కులం పేరుతో బూతు మాటలు తిట్టి అంతు చూస్తానని బెదిరించినందుకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించలని లేకుంటే ముదిరాజుల సత్త ఏంటో చూయిస్తామన్నారు. మీకు ఒక వ్యక్తికి ఏదైనా సమస్య ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలే కానీ మొత్తం జాతిని ఉద్దేశించి మాట్లాడడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఇప్పటికైనా ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తన తప్పును అంగీకరించి క్షమాపణ చెప్పాలని లేకపోతే ముదిరాజ్ లందరు ఏకమై ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రతి గ్రామంలో ముదిరాజ్ కుల బాంధవులు ఉన్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక తీసుకుని వెంటనే తొలగించాలని ముదిరాజ్ మండల నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మండల నాయకులు ఎర్రసాయిలు, ఎస్ గంగారం, దామా నర్సయ్య, సహేందర్, బి నర్సయ్య, రమేష్, భూమయ్య తో పాటు మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన మండల, గ్రామ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.