సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో మోడీ

నవతెలంగాణ – ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ దీపావళి వేడుకలను సైనికులతో కలిసి జరుపుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని లెప్చా ఏరియాలో సైనికులను కలిసి మాట్లాడిన ఫొటోలను ఆయన ట్వీట్ చేశారు. చైనా బార్డర్ కు సమీపంలో ఉన్న ఈ ఏరియా అత్యంత కీలకమైన ప్రదేశం.. ఆదివారం ఉదయమే ప్రధాని మోడీ ఇక్కడికి చేరుకున్నారు. ఆర్మీ యూనిఫాం ధరించి సైనికులు, అధికారులతో కలిసిపోయారు. దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మోడీ దీపావళి పండుగను సైనికులతో కలిసి జరుపుకుంటున్నారు. ఏటా ఏదో ఒక బార్డర్ ఏరియాకు వెళ్లి పండుగ పూట సైనికులను కలుస్తున్నారు. సరిహద్దులను కాపాడేందుకు కుటుంబానికి దూరంగా ఉంటున్న వారితో పండుగను సెలబ్రేట్ చేసుకోవడం సంతోషంగా ఉంటుందన్నారు.

Spread the love