తొలగింపుల్లో మహిళలే ఎక్కువ

తొలగింపుల్లో మహిళలే ఎక్కువవిరామం తర్వాత ఉద్యోగాల్లోకి తిరిగి వస్తున్న మహిళలకు ఉపాధి అవకాశాలు ఎలా వున్నాయి? ఈ ఏడాది తొలగింపుల వల్ల మహిళలు ఎలా ప్ర్రభావితమయ్యారో? ఉద్యోగాల కోసం వెదుకుతున్నపుడు వారు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారో? జీతాల విషయంలో రాజీ పడాల్సిందేనా? వీటన్నింటిపై ఉద్యోగాలు కోల్పోయిన కొంత మంది మహిళలు ఏమంటున్నారో చూద్దాం…
మహిళల కోసం పని చేస్తున్న ప్రముఖ కెరీర్‌ ఎంగేజ్‌మెంట్‌ ప్లాట్‌ఫారమ్‌ అయిన హెర్‌ కీ ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి వర్క్‌ఫోర్స్‌లోకి తిరిగి ప్రవేశించాలని లక్ష్యంగా పెట్టుకున్న 82% మంది మహిళల్లో, 57% మంది మహిళలు తమ ఉద్యోగాలను విడిచిపెట్టారు లేదా తొలగించబడ్డారు. 45% మంది పూర్తి సమయం ఉపాధిని కోరుతున్నారు. గత వారమే రితికా ఒక ఐటీ సేవల సంస్థలో కంటెంట్‌ స్ట్రాటజీలో ఉద్యోగం నుండి తొలగించబడింది. రాధిక ఈ ఏడాది ప్రారంభంలో ఓ కంపెనీలో పబ్లిక్‌ రిలేషన్స్‌ మేనేజర్‌గా నియమించ బడ్డారు. అయితే తన అవసరం కంపెనీకి ఇక లేదనే కారణంతో కొన్ని నెలల్లోనే తొలగించ బడింది. సర్వేలో భారతదేశం అంతటా అన్ని రంగాలకు చెందిన 2,500 మంది మహిళల అభిప్రాయాలు ఇందులో వున్నాయి. ఈ ఏడాది తొలగించబడిన వారిలో పెద్ద సంఖ్యలో మహిళలు ఉన్నారనే వాస్తవాన్ని ఈ సంఖ్య సూచిస్తుంది. ఇది ఆందోళనకరమైన విషయం.
ఆర్థిక వ్యవస్థపై ప్రభావం…
నేహా బగారియాచే స్థాపించబడిన హెర్‌ కీ సాంకేతిక రంగంలో నిరంతర తొలగింపులకు సాక్ష్యంగా ఉంది. చాలా కంపెనీలు తమ ఖర్చులు తగ్గించుకునేందుకు ఇలా వ్యవహరిస్తున్నాయి. అయితే ”ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మహిళల అసమాన తొలగింపులు లింగ అసమానతను ఎత్తి చూపడమే కాకుండా విస్తత ఆర్థిక సమస్యలను కూడా పెంచుతున్నాయి. బలమైన జాబ్‌ మార్కెట్‌ను నిర్వహించడానికి, భారతదేశంలో ఆర్థిక వద్ధిని ప్రోత్సహించడానికి ఈ ధోరణిని పరిష్కరించడం, మార్చడం చాలా కీలకం” అని ఆమె వివరిస్తుంది.
నైపుణ్యాలు వున్నా…
కన్సల్టెంట్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నిరుపమ ప్రకారం ఐటీ సేవలు, కన్సల్టింగ్‌ వంటి రంగాలలో మహిళల తొలగింపులు పెరుగుతున్న ధోరణి ఆందోళనకరంగా ఉంది. భారతదేశంలో ఉద్యోగం చేయగల మహిళలు ఎక్కువ భాగం ఉన్నప్పటికీ ఉద్యోగాల కోత వల్ల వారు అసమానంగా ప్రభావితమైనట్లు కనిపిస్తున్నారని స్టాటిస్టా నివేదికను ఆమె ఉటంకించారు. ”ఈ ధోరణి ఈ మహిళల తక్షణ జీవనోపాధిని ప్రభావితం చేయడమే కాకుండా కార్యాలయంలో లింగ సమానత్వం వైపు సాధించిన పురోగతిని వెనుకకు నెట్టివేస్తుంది. హెచ్‌ఆర్‌లో నా అనుభవంతో, ఈ అసమానతలను పరిష్కరించడం, మరింత సమానమైన ఉపాధి పద్ధతుల కోసం పని చేయడం చాలా కీలకమని నేను నమ్ముతున్నాను” ఆమె చెప్పింది.
కష్టతరంగా….
పురుషుల కంటే ఎక్కువ మంది మహిళలు తరచుగా వ్యక్తిగత కారణాల వల్ల కెరీర్‌కు విరామం తీసుకోవలసి వస్తుంది. అయితే ఇవి కేవలం గర్భం, ప్రసవం, పిల్లలు, వద్ధుల సంరక్షణ వంటి వాటికి మాత్రమే పరిమితం కాదు. వారు ఆశించిన కెరీర్‌ వద్ధి లేదా అభివద్ధి లేకపోవడం మరొక కారణం. గత 30 ఏండ్లుగా జర్నలిస్టుగా పనిచేస్తున్న శారదను ఈ ఏడాది ఉద్యోగం నుంచి తొలగించారు. ”మీడియా పరిశ్రమలోనూ ఎంత అనుభవం వున్నా సమస్య తీవ్రంగానే ఉందని నేను భావిస్తున్నాను. అనుభవజ్ఞులైన వ్యక్తులకు చాలా తక్కువ ఉద్యోగాలు ఉన్నాయి. దీనివల్ల కింది స్థానాలకు దరఖాస్తు చేసుకోవలసి వస్తుంది” అని ఆమె చెప్పింది.
విరామాన్ని ఉపయోగించుకుంటున్నా…
రెండు నెలల క్రితం తన టెక్‌ ఉద్యోగం నుండి తొలగించబడిన రాజశ్రీ ఈ నిర్ణయం పట్ల తాను ఆశ్చర్యం చెందలేదని చెప్పింది. ”నా కంపెనీలో తొలగించబడిన అనేక మంది వ్యక్తులలో నేను భాగం. కానీ ఎనిమిదేండ్లకు పైగా అక్కడ పనిచేసినందున 44 ఏండ్ల వయసులో నేను కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించడం గురించి ఆందోళన చెందుతున్నాను. అయితే కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి, జాబ్‌ మార్కెట్‌లో అడిగే ప్రశ్నలకు అనుగుణంగా ఉండటానికి నేను విరామాన్ని ఉపయోగిస్తున్నాను. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఐటీ, ఈకామర్స్‌ రంగాల్లో ఉద్యోగుల తొలగింపులు ఎక్కువగా జరుగుతు న్నాయని ఆమె చెప్పారు.
సవాళ్లను నావిగేట్‌ చేయడం…
బగారియా ఇటీవలి హెర్‌కీ సర్వేలో 47% మంది మహిళలు తమ ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుచుకునే లక్ష్యంతో తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని వెల్లడించింది. ”హెర్‌కీలో నేర్చుకోవడం అనేది ఒక ముఖ్యమైన అంశం. అలాగే మహిళలు తమ కెరీర్‌లో ముందుకు సాగడానికి ఉద్దేశించిన కోర్సులను అందించే 800 మంది భాగస్వాములతో మేము సహకరించాము. హెర్‌ కీ ఇటీవలే కమ్యూనిటీస్‌ అనే నెట్‌వర్కింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ను పరిచయం చేసింది. ఇక్కడ మహిళలు తమ ప్రయాణాలను నేర్చుకోవడానికి, నిమగమవ్వడానికి, నెట్‌వర్క్‌ చేయడానికి, హైలైట్‌ చేయడానికి కనెక్ట్‌ చేసుకోవచ్చు”అని ఆమె చెప్పింది.