పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కు ఎంపీ హాజరు..

నవతెలంగాణ-దుబ్బాక రూరల్ 
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గంభీర్పూర్ గ్రామంలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని ఆదివారం నిర్వహకులు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ , బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు.అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎంపీ వెంట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
పలువురి కి పరామర్శ
రామక్కపేట గ్రామానికి చెందిన జర్నలిస్ట్ అహోబిలం వెంకటేశ్వర్, మైసిరాజు ల కుటుంబాలతో పాటు  మున్సిపల్ పరిధిలోని ధర్మాజిపేట్ వార్డ్ కి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు నర్మెట యేసురెడ్డి కుటుంబాన్ని ఆదివారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కలిసి పరామర్శించారు. అనంతరం రఘోతంపల్లి గ్రామానికి చెందిన పెద్దారెడ్డి చందు రెడ్డి ఫీవర్ తో దుబ్బాకలోని శ్రీనివాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని వారిని పరామర్శించి, వివరాలు అడిగి తెలుసుకుని…మెరుగైన వైద్యం అందించాలని ఎంపీ వైద్యులను ఆదేశించారు.ఎంపీ వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు
Spread the love