కొందరికి శాశ్వత నివాసంగా ఎన్‌సీఏ!

ముంబయి : భారత క్రికెటర్ల గాయాల నిర్వహణ పట్ల మాజీ చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి విమర్శలు గుప్పించారు. కొందరు ఆటగాళ్లకు జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) శాశ్వత నివాసంగా మారిందని అన్నాడు. ‘గత 3-4 ఏండ్ల నుంచి కొందరు క్రికెటర్లు ఎన్‌సీఏను శాశ్వత నివాసంగా చేసుకున్నారు. ఇది ఏమాత్రం మంచి పరిణామం కాదు. గాయాల బారిన ఆటగాళ్లెవరూ వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఆడింది లేదు. ఎందుకు పదేపదే గాయాలు, ఎందుకు మళ్లీ ఎన్‌సీఏ బాట పట్టడం? రీ ఎంట్రీలో మూడు మ్యాచులు ఆడటం వెంటనే ఎన్‌సీఏకు వెళ్లటం సాధారణమైంది’ అని రవిశాస్త్రి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. చీటికిమాటికి ఆటగాళ్లకు గాయాలు కావటం బోర్డు, ఐపీఎల్‌ జట్లకు, కెప్టెన్లకు ఎంతో చికాకు కలిగిస్తోందని శాస్త్రి అన్నాడు.

Spread the love