
నవతెలంగాణ-మహేశ్వరం
మూడు రోజుల నుండి ఎడతెరపి లేకుండా కురు స్తున్న వర్షాలకు చెరువులు కుంటల్లోకి నీరు వచ్చి చేరు తుంది. వానా కాలంలో కొద్దిగా లే టుగా వర్షాలు పడినగాని పంట పొ లాలకు అనుకూలంగా ఉంటుందని రైతులు అంటున్నారు. మండలం లో గురువారం అత్యధికంగా 40.1 మి.మీవర్షం కురిసిందని తహసీల్దార్ మహమూద్ అలీ తెలిపారు. లోతట్టు ప్రాంతాలు, చెరువులు, కుంటల వద్ద కు ప్రజలు వెళ్లవద్దని వర్షాలకు ప్రజలు, రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.