కేరళలో విస్తారంగా వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

నవతెలంగాణ – కేరళ: కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించడంతో ఆ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. తీర ప్రాంతా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 5 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది. 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రుతుపవనాలు జూన్ 8న కేరళకు చేరుకున్నాయి. జూన్ 9న రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలు, శని, ఆది, సోమవారాల్లో ఐదు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Spread the love