ప్రజలకు చేరువలో తాండూర్‌ జిల్లా ఆస్పత్రి మెరుగైన వైద్యం అందించేందుకు డాక్టర్ల కృషి


– కార్పొరేట్‌కు ధీటుగా శానిటేషన్‌ పనులు
– ప్రతీ ఆదివారం పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్‌
– ప్రభుత్వం వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి
– పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం
– ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవిశంకర్‌
తాండూరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తోంది. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆస్పత్రి డాక్టర్లు నిరంతరం కృషి చేస్తున్నారు. ఆస్పత్రికి రోజు 500 నుండి 800 మంది రోగులు వస్తుంటారు. ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవిశంకర్‌ ప్రత్యేక కృషి చేస్తున్నారు.
నవతెలంగాణ-తాండూరు
తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి సూపరిం టెండెడంట్‌ రవి శంకర్‌ ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన ప్పటి నుండి ఆస్పత్రిలో ప్రతి ఆదివారం ప్రత్యేక శానిటేషన్‌ డ్రైవ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శానిటేషన్‌ పనులను ఎప్పటికప్పుడు మెరుగు పరుస్తు న్నారు. శానిటేషన్‌ పనులనుతో ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి కార్పొరేట్‌ ఆస్పత్రిని తలపిస్తోంది. పరిసరా లు, గదులను, మరుగుదొడ్లను శుభ్రం చేసి ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఆస్పత్రిలో పనిచ ేసే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సి బ్బందిని ప్రోత్సహి స్తున్నారు. ఆస్పత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ముందుకు పోతున్నారు. అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు వైద్యం అందించేందుకు ఆస్పత్రి సిబ్బంది ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పుష్పగిరి కంటి ఆస్పత్రి సౌజన్యంతో వివిధ రకాల వైద్య సేవలను ఆస్పత్రిఉపయోగించుకుంటుంది. నెలలు నిండకుం డా పుట్టిన శిశువులతో పాటు బరువు తక్కువ ఉన్న పసికందులకు కంటి సమస్యలు రాకుండా వైద్య సేవలు కొనసాగిస్తున్నారు. నవజాత శిశువు సంజీ వని కేంద్రంలో చిన్నారులకు రెటీనా సమస్యలకు చికిత్సలు అందిస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలో అందుబా టులోకి వచ్చినా వైద్య సేవలను నిరంతరం కొనసా గించేందుకు వైద్య సిబ్బంది ప్రత్యేక శిక్షణ వైద్య సేవ లు అందిస్తున్నారు. చిన్నారుల్లో అంధత్వం నియం త్రణ కోసం జిల్లా ఆస్పత్రిలో మెరుగైన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ ఆస్పత్రిలో ప్రజల కు మెరుగైన వైద్య సేవలు అందడంతో పలువురు హర్ష వ్యక్తం చేస్తున్నారు. అందరి సహకారంతో ప్రభుత్వ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అంది స్తామని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవిశం కర్‌ తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులకు, వైద్య సిబ్బందికి డాక్టర్స్‌ డే శుభాకాంక్షలు తెలిపారు.