ఓ అరుణ తార

O Aruna Taraఓ అరుణ తార నింగి కెగసింది
ప్రపంచాన వామపక్ష శిఖరమై నిలిచింది, ఆ తార అసాధారణమైది
కణ కణ మండే అగ్ని జ్వాల, రణమై మండే విప్లవ మాల
విద్యార్థి దశలోనే ఉద్యమాల పురుడుపోసుకుని
ఎర్ర కోటకు వణుకు పుట్టించి
నూతన విద్యార్థి విప్లవానికి నాంది పలికింది
లాల్‌ జెండా చెంతన చేరి మార్స్క్‌, లెనిన్‌ బాటలో
ఆశయాల తోవలో కాంతి పుంజమై సాగింది
కార్మిక, కర్షకుల బతుకుల్లో భాగమై
దోపిడీ దారుల గుండెల్లో గునపమై
అణగారిన వర్గాల్లో వెలుగులు విరజిమ్మింది
మనువాదంపై భగ్గున మండి దాని మూలలను నిలువునా చీల్చి
మతోన్మాదంపై తిరుగుబాటు బాణం సంధించింది
రాజకీయ చతురతను ప్రదర్శించి సెక్యూలర్‌ పార్టీలను ఐక్యం చేసి
దేశ రాజకీయాల్లో నయా చరిత్రను సష్టించింది
ప్రపంచ వామపక్ష పార్టీలకు దిక్సూచిగా నిలిచి
కమ్యూనిజం విశ్వవ్యాప్తం కావాలని తలచి
ప్రజల బాగును నిరంతరం కాంక్షించింది
ఆ వామపక్ష ధ్రువతారే ‘సీతారం ఏచూరి’
కమ్యూనిస్టు బాటసారి
తల్లి నవమాసాల శ్రమని అగ్నిమంటల్లో
బూడిద కానివ్వబోనని ప్రతిన బూని
జ్ఞాన సష్టికి ముడి సరుకుగా మారి మరణమే లేని
విజ్ఞాన జ్యోతిగా వెలుగుతున్నాడు కామ్రేడ్‌ సీతారం ఏచూరి…!
జోహర్లు కామ్రేడ్‌ సీతారం ఏచూరి జోహర్లు.. జోహర్లు..

– అజయ్‌ కుమార్‌, 8297630110