ఓ బొజ్జ గణపతి

O Bojja Ganapatiఓ బొజ్జ గణపతి
ప్రకృతికి అధిపతి
పంచభూతాలు నీ సృష్టి
పూజలో పత్రి అందుకు సాక్షి
మానవాళి శ్రేయస్సు దృష్టి
కాలుష్యరహితం మట్టితో నీ మూర్తి
ప్రకృతి వైపరిత్యాలకు ఇక స్వస్తి
మట్టి వినాయక ప్రతిమ చేసే నివృత్తి
ప్లాస్టిక్ వ్యర్ధాలకు పలికే స్వస్తి
గ్లోబల్ వార్మింగ్ దిశగా ప్రతివ్యక్తి
ఇంటింట వెలిసే స్వయంభూ మూర్తి
పిల్లపాపలకు వినోదం నీ ఆకృతి
గంగమ్మ ఒడిలో చటుక్కున కరిగిపోయే
పార్వతీతనయ నీ బంటు మేమయ్యే
ఏటేటా దీవింపరావయ్యా

– కలం.. శ్రీవాణి