తాడ్వాయి నూతన ఎస్సై గా ఓంకార్ యాదవ్ బాధ్యతల స్వీకరణ

నవతెలంగాణ- తాడ్వాయి
ములుగు జిల్లా సమ్మక్క- సారక్క తాడ్వాయి మండలం నూతన ఎస్సైగా బి ఓంకార్ యాదవ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన ఎస్సై చావళ్ల వెంకటేశ్వరరావు వాజేడు పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై బి ఓంకార్ యాదవ్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందిస్తున్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చి సంప్రదించాలని ఎస్సై ఓంకార్ యాదవ్ తెలిపారు.  జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. పోలీస్ సిబ్బంది నూతన ఎస్సై కి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బదిలీపై వెళ్తున్న ఎస్సై వెంకటేశ్వరరావుకు పోలీసు సిబ్బంది సన్మానించారు.