ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ఆహ్వానం

– టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఇంటర్‌మిడియట్‌ కోర్సులకు సంబంధించి మంగళవారం నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవాలని తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్స్టిట్యూషన్స్‌ సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఎస్‌) కార్యదర్శి రొనాల్డ్‌రోస్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీ ఒకేషనల్‌ గ్రూపుల్లో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్‌లో ప్రవేశం కోసం 2023-24 విద్యాసంవత్సరానికి సీఓఈ సంస్థలు నేటి నుంచి 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో www.tswreis.ac.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థి దరఖాస్తు రుసుము కోసం రూ.100/- చెల్లించాలని తెలిపారు. ఈ చెల్లింపు క్రెడిట్‌ కార్డ్‌ / డెబిట్‌ కార్డ్‌ / నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా చేయాలని సూచించారు.