Skip to content
  • Friday, December 8, 2023

  • రాష్ట్రీయం
    • తెలంగాణ రౌండప్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • మహబూబ్ నగర్
    • నల్లగొండ
    • ఆదిలాబాద్
    • రంగారెడ్డి
    • కరీంనగర్
    • మెదక్
    • వరంగల్
    • ఖమ్మం
    • నిజామాబాద్
  • సినిమా
  • ఆటలు
  • సోపతి
    • కవర్ పేజీ
    • కథ
    • సీరియల్
    • కవర్ స్టోరీ
    • అంతరంగం
    • సండే ఫన్
    • మ్యూజిక్ లిటిలేచర్
    • చైల్డ్ హుడ్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • రిపోర్టర్స్ డైరీ
  • ఫీచర్స్
    • దర్వాజ
    • దీపిక
    • వేదిక
    • మానవి
    • జోష్
    • బిజినెస్
  • ఈ-పేపర్
  • Home
  • Editorial
  • ఇమ్రాన్‌ విడుదలకు పాక్‌ సుప్రీం ఆదేశం!
Editorial Main News

ఇమ్రాన్‌ విడుదలకు పాక్‌ సుప్రీం ఆదేశం!

May 12, 2023
7:55 pm

        ఉక్రెయిన్‌ సంక్షోభంలో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధానిగా మాస్కో వెళ్లి పుతిన్‌తో భేటీ కావటం పాకిస్థాన్‌లో అమెరికా అనుకూల శక్తులకు మింగుడు పడలేదు. పాక్‌ సైనిక దళాల మాజీ అధిపతి జనరల్‌ జావేద్‌ బజ్వా రష్యా వైఖరిని ఖండించాలని కోరగా ప్రధానిగా ఉండగా తాను తిరస్కరించానని, తరువాత అమెరికాను సంతుష్టీకరించేందుకు బజ్వా స్వయంగా ఖండించినట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇమ్రాన్‌ ఖాన్‌ ఒక సభలో వెల్లడించారు. అమెరికా వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్న భారతే తటస్తంగా ఉన్నప్పుడు పాక్‌ ఒక పక్షంవైపు ఎందుకు నిలబడాలని ప్రశ్నించారు.
పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను ఒక అవినీతి కేసులో మంగళవారం నాడు అరెస్టు చేసిన తీరును అక్కడి సుప్రీం కోర్టు తప్పుపట్టింది. అరెస్టు అక్రమం అంటూ తక్షణమే విడుదలకు గురువాతరం ఆదేశించింది. తమ నేత నిర్బంధాన్ని నిరసిస్తూ పాకిస్థాన్‌ తెహరిక్‌ ఇ ఇన్సాఫ్‌(పిటిఐ) పార్టీ ఆందోళనకు పిలుపునివ్వటంతో పాటు సుప్రీం కోర్టులో సవాలు చేసింది. గురువారం సాయంత్రం వరకు అందిన వార్తల ప్రకారం హింసా కాండలో ఎనిమిది మంది ప్రాణాలు పోగా వందలాది మంది గాయపడ్డారు. తమ మద్దతుదారులు 50మంది మరణించినట్లు పిటిఐ చెబుతోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మిలిటరీ రంగంలోకి దిగింది. ఇంటర్నెట్‌, టెలికమ్యూనికేషన్లను నిలిపివేశారు. వేలాది మందిని అరెస్టు చేశారు. ఎక్కడేం జరుగుతోందన్నది పూర్తిగా వెల్లడి కావటం లేదు. సుప్రీం ఆదేశాలతో ఖాన్‌ మద్దతు దారులు ఆందోళన విరమిం చారు.
పాకిస్థాన్‌కు చెందిన ఒక రియలెస్టేట్‌ సంస్థ, ఇతరులు జరిపిన మనీలాండరింగ్‌ అవినీతి కేసుల్లో బ్రిటన్‌ పోలీసులు పాక్‌ కరెన్సీలో 50బిలియన్లకు సరిపడా అక్రమాలను నిర్థారించి, ఆ సొమ్మును ఇస్లామాబాద్‌కు పంపారు. ఆ మొత్తాన్ని అక్రమాలకు పాల్పడిన వారి చేతుల్లో బాధితులుగా మారిన వారికి చెల్లించేందుకు ప్రధానిగా ఉన్నప్పుడు ఇమ్రాన్‌ ఖాన్‌, అతని సతీమణి విలువైన నగలు, కొంత భూమి, నగదుతో సహా ఐదు బిలియన్ల మేరకు లంచంగా తీసుకున్నారన్న ఆరోపణలు రాగా కేసులు దాఖలు చేశారు. ఈ సొమ్ము ప్రభుత్వానికి చెందాల్సి ఉండగా దారి మళ్లించి అక్రమాలకు పాల్పడిన వారికే మేలు చేశారన్నది ఆరోపణ. ఆ కేసులోనే మన దేశంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) వంటి పాక్‌ జాతీయ జవాబుదారీ బ్యూరో(ఎన్‌ఏబి) ఇమ్రాన్‌ ఖాన్‌ను అరెస్టు చేసింది, ఎన్‌ఏబి కోర్టులో ప్రవేశపెట్టగా ఎనిమది రోజుల రిమాండ్‌ విధించింది. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని ఖాన్‌ చెబుతుండగా ప్రధానిగా అనేక ఉదంతాలలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు అధికారిక పత్రాలే వెల్లడిస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు ఆరోపించారు. తమ నేతను వేధిస్తున్నారంటూ మద్దతుదారులు పెద్ద ఎత్తున వీధుల్లోకి ఎక్కారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిలు ఇవ్వాలని ఇమ్రాన్‌ ఖాన్‌ ఇస్లామాబాద్‌ హైకోర్టుకు వెళ్లి అక్కడ వేలి ముద్రలు వేస్తుండగా ఎన్‌ఏబి అరెస్టు చేసిందని, అనుచితంగా ప్రవర్తించిందని, ఇది అక్రమం అని ఖాన్‌ లాయరు సుప్రీం కోర్టుకు నివేదించారు. ఈ కేసును విచారిస్తున్న ప్రధాన న్యాయమూర్తి బండియాల్‌ ఎన్‌ఏబి తీరును తప్పు పట్టారు. కోర్టుకు వచ్చిన వారినెవరినీ అరెస్టు చేయకూడదని, ఖాన్‌ అరెస్టుతో కోర్టుల గౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీసినట్లు వ్యాఖ్యానించటం విశేషం.
అనేక దేశాల్లో అధికారంలో ఉన్న పెద్దలు అవినీతికి పాల్పడటం కొత్తేమీ కాదు. ఇదే సమయంలో తమకు నచ్చని నేతలను అక్రమ కేసుల్లో ఇరికించి జైళ్లకు పంపి అడ్డుతొలగించుకోవటం కూడా తెలిసిందే. లాటిన్‌ అమెరికాలో అనేక దేశాల పరిణామాలు దీన్ని వెల్లడించాయి. ప్రస్తుతం బ్రెజిల్‌ అధ్యక్షుడిగా ఉన్న లూలా డిసిల్వాను గత ఎన్నికల్లో పోటీలో లేకుండా చేసేందుకు జరిపిన కుట్రలో అక్రమకేసులతో జైలుకు పంపారు. తరువాత అవి తప్పుడువని తేలటంతో వాటిని కొట్టివేశారు. ఇమ్రాన్‌ ఖాన్‌కు లూలాకు ఎలాంటి పోలికలేదు. అవినీతికి పాల్పడిందీ లేనిదీ కూడా నిర్ధారించలేం. నిజంగా పాల్పడితే ఎవరినీ సమర్థించనవసరం లేదు. అయితే ఉక్రెయిన్‌ సంక్షోభంలో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధానిగా మాస్కో వెళ్లి పుతిన్‌తో భేటీ కావటం పాకిస్థాన్‌లో అమెరికా అనుకూల శక్తులకు మింగుడు పడలేదు. పాక్‌ సైనిక దళాల మాజీ అధిపతి జనరల్‌ జావేద్‌ బజ్వా రష్యా వైఖరిని ఖండించాలని కోరగా ప్రధానిగా ఉండగా తాను తిరస్కరించానని, తరువాత అమెరికాను సంతుష్టీకరించేందుకు బజ్వా స్వయంగా ఖండించినట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇమ్రాన్‌ ఖాన్‌ ఒక సభలో వెల్లడించారు. అమెరికా వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్న భారతే తటస్తంగా ఉన్నప్పుడు పాక్‌ ఒక పక్షంవైపు ఎందుకు నిలబడాలని ప్రశ్నించారు. భారత్‌కు ఇస్తున్న మాదిరి రష్యా తమకూ తక్కువ ధరలకు చమురు, ఆహార ధాన్యాలను ఇవ్వాలని ఒప్పించేందుకే మాస్కో వెళ్లినట్లు చెప్పాడు. అందువలన ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో తెరవెనుక అమెరికా అనుకూల శక్తుల హస్తం లేదని చెప్పలేం. పాకిస్థాన్‌లో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ తాము గీచిన గీతల పరిధిలోనే ఉండేట్లు అమెరికా చూసుకుంటున్న సంగతి తెలిసిందే. ఎవరైనా గీత దాటితే ఇమ్రాన్‌ ఖాన్‌కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించటం కూడా కావచ్చు. తనను హతమార్చే కుట్రలు కూడా జరుగుతున్నట్లు గతంలో ఖాన్‌ చెప్పాడు. ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టు తరువాత పలు నగరాల్లో జరిగిన హింసాత్మక ఉదంతాల వెనుక భారత్‌ నుంచి పంపిన వారి హస్తం ఉందని, హింసాకాండ తరువాత బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మిఠాయిలు పంచి పండుగ చేసుకున్నట్లు పాక్‌ ప్రధాని ప్రత్యేక సహాయకుడు అత్తాతరార్‌ ప్రకటించాడు. పాకిస్థాన్‌లో తాజా పరిణామాల గురించి మన దేశంతో సహా విదేశాలు ఇంతవరకు ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. తాజా పరిణామాల పర్యవసానాల గురించి ఇంకా పరిశీలించాల్సి ఉంది.

Spread the love

Related posts:

retreat-lessonsతిరోగమన పాఠాలు పాలకులే-నేరస్థులైతేపాలకులే నేరస్థులైతే..? పేదరికం తగ్గిందట! LIFE-IMEGEమేల్కొనే పండుగ VANDE-BARATH-TRAINఎంతో చేసుంటే ఇంతాయాసమెందుకు? editorialఆవుపాలే కాదు… ఓట్లు కూడా..!
Tags: Editorial, Imran Khan, Telugu News

Post navigation

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు సుందరయ్య..
మాతృ వందనం…

తాజా వార్తలు

మరో మార్పునకు నాంది బిఎస్పీతోనే సాధ్యం

rajinikanth-says-who-owns-the-world-cup

వరల్డ్ కప్ ఎవరిదో చెప్పిన తలైవా

assembly-election-polling-is-ongoing-in-chhattisgarh-madhya-pradesh

మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

కర్నాటకలో కాంగ్రెస్ డొల్ల : మంత్రి హరీశ్ రావు

బీఆర్ఎస్ పార్టీలో చేరిన కత్తి కార్తీక

a-horse-that-escaped-from-its-cage-in-a-cargo-plane

కార్గో విమానంలో బోను నుంచి తప్పించుకున్న గుర్రం..

భారీగా పెరిగిన ఉల్లి ధర..

  AboutUs        ContactUs

Copyright © 2023 | NavaTelangana

Powered by DigiQuanta