పాలడుగు భాస్కర్‌ని అత్యధిక మెజార్టీతో గెలిపించండి

– అన్ని కార్మిక సంఘాలు పూర్తి మద్దతు ఇవ్వాలి
– సీఐటీయూ మధిర నియోజకవర్గ
కన్వీనర్‌ నరసింహారావు
నవతెలంగాణ-మధిర
మధిర అసెంబ్లీ నియోజకవర్గానికి సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న పాలడుగు భాస్కర్‌ పోటీ చేస్తున్నారని, మధిర అసెంబ్లీ నియోజకవర్గంలోని కార్మిక సంఘాలు మద్దతు తెలిపి, రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీఐటీయూ మధిర నియోజకవర్గం కన్వీనర్‌ శీలం నరసింహారావు పేర్కొన్నారు. సోమవారం మధిరలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక రంగాల సమస్యలే ప్రధాన జెండాగా పోరాటాలు నిర్వహించిన సీపీఐ(ఎం) అభ్యర్థి పాలడుగు భాస్కర్‌కి కార్మికులందరూ అండదండలు అందించాలని, కార్మికుల పక్షాన అనేక పోరాటాల నిర్వహించిన అంగన్వాడి, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులు, మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ ఆర్టీసీ, ఇలా అన్ని రకాల కార్మికుల సమస్యల పట్ల అనేక పోరాటాలు నిర్వహించిన సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధిర నియోజకవర్గంలోని కార్మికులందరూ ఓటు వేసి సహాయ సహకారాలు అందించాలన్నారు. పాలడుగు భాస్కర్‌ కార్మిక వర్గ పక్షపాతిగా, అంతేకాకుండా వ్యవసాయ రంగ, ఉద్యోగ, కూలీల, ఇలా అన్ని రంగాల తరఫున అనేక ఉద్యమాలను నిర్వహించి పేద ప్రజల పట్ల అండగా ఉన్నారు. అట్లాంటి వ్యక్తి మధిర నియోజకవర్గానికి పోటీ చేయుచున్న సందర్భంగా ప్రజలందరూ తమ అమూల్యమైన ఓటును సుత్తి కోడలి నక్షత్రం గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీని అందించాలని కోరారు. ఈ సమావేశంలో మధిర పట్టణ మండల కార్యదర్శిలు పడకంటి మ