పంచాముఖాంజనేయ వార్షికోత్సవ

నవ తెలంగాణ – నాగోల్
ఆదివారం మెదక్ జిల్లా, చేగుంట మండలంలోని స్టేషన్ రోడ్, చేగుంటలో జరిగిన శ్రీ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయ అష్టాదశ మరియు నగరేశ్వర పంచాముఖాంజనేయ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్, ఐ వి ఎఫ్ తెలంగాణ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టెంపుల్ చైర్మన్ నగేష్ గుప్త, మరియు చేగుంట ఆర్యవైశ్య సంఘం నాయకులు, మరియు టెంపుల్ ట్రస్ట్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.