పంచాయతీ కార్మికులను పట్టించుకోవాలి

నవతెలంగాణ-భిక్కనూర్
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పట్టించుకోవాలని పంచాయతీ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు యాదగిరి తెలిపారు. మండల కేంద్రంలో పంచాయతీ కార్మికులు చేపట్టిన నిరసన దీక్షలు శుక్రవారం 16వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పంచాయతీ కార్మికులు మాట్లాడుతూ పంచాయతీ కార్మికులు గత కొన్ని సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారని, ప్రతి కార్మికుని కనీస వేతనం అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పలు గ్రామాల పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.