టీ20 సిరీస్‌కు పాండ్య దూరం

టీ20 సిరీస్‌కు పాండ్య దూరంముంబయి : భారత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య చీలమండ గాయం నుంచి కోలుకునేందుకు మరింత సమయం పట్టనుంది. ప్రపంచకప్‌ నాకౌట్‌ మ్యాచులకు అందుబాటులో ఉంటాడని ఆశించినా.. ఫిట్‌నెస్‌ టెస్టు సమయంలో వాపు రావటంతో వరల్డ్‌కప్‌కు దూరమయ్యాడు. తాజాగా నవంబర్‌ 23 నుంచి ఆసీస్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌లోనూ పాండ్య ఆడటం లేదు. ఈ మేరకు బీసీసీఐ వైద్య బృందం పాండ్యకు ఎనిమిది వారాల విశ్రాంతి సూచించింది. ప్రపంచకప్‌ జట్టులో మెజార్టీ ఆటగాళ్లు ఆసీస్‌తో పొట్టి పోరుకు దూరంగా ఉండనున్నారు. ఆసియా క్రీడలకు వెళ్లిన యువ జట్టును టీ20 సిరీస్‌కు ఎంపిక చేయనున్నారు. చీఫ్‌ కోచ్‌ ద్రవిడ్‌ కాంట్రాక్టు ప్రపంచకప్‌తో ముగియనుంది. దీంతో వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఆసీస్‌ సిరీస్‌కు చీఫ్‌ కోచ్‌గా ఉండనున్నాడు.

Spread the love