టాలన్స్‌పై పాంజర్స్‌ పైచేయి ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌

జైపూర్‌ : వరుస విజయాలతో ఊపుమీదున్న తెలుగు టాలన్స్‌.. వరుస పరాజయాలు మూటగట్టుకుంది. సోమవారం జరిగిన ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌ (పీహెచ్‌ఎల్‌) గ్రూప్‌ దశ మ్యాచ్‌లో ఢిల్లీ పాంజర్స్‌ చేతిలో రెండు గోల్స్‌ తేడాతో ఓటమి చెందింది. ప్రథమార్థంలో 13-12తో ముందంజలో నిలిచిన తెలుగు టాలన్స్‌.. విరామం అనంతరం సైతం దూకుడుగా ఆడింది. ఢిల్లీ పాంజర్స్‌పై మ్యాచ్‌పై 90 శాతం ఆధిపత్యం చెలాయించింది. కానీ చివరి ఐదు నిమిషాల్లో ఆధిక్యంలోకి దూసుకొచ్చిన పాంజర్స్‌ 25-25తో స్కోరు సమం చేయటంతో పాటు 28-25తో ముందంజ వేసింది. టాలన్స్‌ గట్టిగా పోరాడినా.. పరాజయం తప్పలేదు. టాలన్స్‌ గోల్‌కీపర్‌ రాహుల్‌ 20 గోల్‌ ప్రయత్నాలను అడ్డుకుని ఔరా అనిపించాడు. పాంజర్స్‌ ఆటగాడు దీపక్‌ 11 గోల్స్‌తో ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తెలుగు టాలన్స్‌ తన తర్వాతి మ్యాచ్‌లో రాజస్థాన్‌ ప్యాట్రియాట్స్‌తో తలపడనుంది.

Spread the love