ప్రచారానికి పసలెట్లా.?

– అప్పు చేద్దామన్న దొరకడం లేదంటున్న అభ్యర్థులు
– స్థిరాస్తులు అమ్మిన సకాలంలో చేతికందని నగదు
– రోజువారీ ఖర్చులకు ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన
నవతెలంగాణ-  మల్హర్ రావు
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బు కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల ఖర్చు కోసం ముందుగా వేసుకున్న అంచనాలు లెక్క తప్పాయి. రోజువారీ ప్రచారానికి ఖర్చులు వెల్లదియడం కూడా అభ్యర్థులకు కష్టంగా మారింది. అప్పు చేద్దామన్న దొరికే పరిస్థితి లేకపోవడంతో ఎంత మిత్తి ఇవ్వడానికైనా సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. అభ్యర్థుల నుంచి డబ్బులు అందకపోవడంతో ద్వితీయ క్యాడర్ విమర్శలకు దిగుతున్నారు. కొందరు జెండా పక్కన పడేసి ప్రచారంలో పాల్గొనడం లేదు.
రోజు ఖర్చులే తడిసి మోపడు..
అభ్యర్థులకు రోజువారి ఖర్చులు తడిసి మోపడు అవుతున్నాయి. పోలింగ్ భూతుల వారిగా ప్రచారం చేసే కార్యకర్తలకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం చేతి ఖర్చులు సగటున ఒక్కొక్క బుతుకు రోజు రూ.15 వెలు ఖర్చు వస్తుంది. వివిధ పార్టీల నుంచి చేరికల సందర్భంగా భోజనాలు, రవాణా ఖర్చులు కొందరికి ప్యాకేజిలకు రూ.లక్షలు ముట్టజెప్పాల్సి ఉంటుంది. అంతే కాకుండా ముఖ్య నాయకులకు వాహనాల కిరాయి,డీజిల్,పెట్రోల్ ఇతరత్రా ఖర్చులు ఏ రోజుకు ఆ రోజు చెల్లించాలసిందే.దీంతో పాటు సభలకు రోజువారీ ప్రచారానికి వచ్చే మహిళలకు, యువత బైక్ ర్యాలీలకు, ప్రచార రథాలు, కళాకారులకు ఏరోజుకు ఆ రోజు చెల్లించాలి. దీంతోపాటు ప్లెక్సీలు, జెండాలు ఎన్నికల ప్రచార సామగ్రి ఇలా పలు రకాలుగా లెక్కకు రాని ఖర్చు  రూ. లక్షల్లో ఉంటుంది.
Spread the love