పెండింగ్‌ ఉపకారవేతనాలు,

– ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి
– ఏఐఎస్‌ఎఫ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పెండింగ్‌ ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్‌ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మూడేండ్లకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకారవేతనాల నిధులు విడుదల కాలేదని తెలిపారు. మూడేండ్లలో రూ.4 వేల కోట్ల బకాయిలు పడిందని పేర్కొన్నారు. వెంటనే విడుదల చేయాలనీ, లేకపోతే ఎమ్మెల్యేలు, మంత్రుల ఇండ్లు ముట్టడిస్తామనీ, ఛలో ప్రగతిభవన్‌ చేపడతామని హెచ్చరించారు.