నా లోపలికి వెళ్లాలంటే
అన్నీ ముళ్ళ చెట్టు, రాళ్ళ దిబ్బలే
ప్రయాణమంటే ప్రాణం మీదకు వస్తుంది..
మనసును ఎంత చివ్వినా
కోరికల ముడులతో
అడ్డుకట్టేసినా కల జల ఆగక
కాలం వృధాగా పొంగుతూ
నిద్రను కోసుకుపోతుంది.
నా చేతికి నేనే ఏమీ కానట్లు
ఓ బలహీనతకు నాలో నేనే
ఒంటరిగా మారడం చూసి
ఏకాంతం జాలిపడుతూ చేతులెత్తేసింది.
మరణం లేని కోరికలతో కలలకు తీరికుండదు
నిద్ర లేని మనసుతో మనిషిలో జీవముండదు
– చందలూరి నారాయణరావు, 9704437247