పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

నవతెలంగాణ -తాడ్వాయి: పోలింగ్ బూత్ ల వద్దకు వెళ్లి ఓటేయలేని పరిస్థితిలో ఉండి పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులు 80 ఏళ్ల పైబడిన సీనియర్ సిటిజనులకు సోమవారం మండలంలోని కాటాపూర్, దామరవాయి, బీరెల్లి, పంభాపూర్, రంగాపూర్, కొండపర్తి గ్రామాలలో ని 21మంది, వారు ఇంటి వద్దనే ఓటు వేశారు. ఎన్నికల అధికారులు పోస్టల్ బ్యాలెట్ తో కూడిన ఈవీఎంలను ఇంటి వద్దకే తీసుకెళ్లి, వారి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అన్ని చర్యలు తీసుకున్నారు. దీంతో మండలంలో 21 మంది వృద్ధులు దివ్యాంగులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ అధికారి జితేందర్ రెడ్డి, మైక్రో అబ్జర్వర్ నవీన్, రూట్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్, బి ఎల్ వో లు ఇందారపు నిర్మల, సాయిరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.