ప్రజా ఆశీర్వాద సభను జయప్రదం చేయాలి

– మురహరి బిక్షపతి తెలంగాణ ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షులు
నవతెలంగాణ-గోవిందరావుపేట:
సీఎం కేసీఆర్ హాజరవుతున్న ప్రజా ఆశీర్వాద సభను జయప్రదం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు మురహరి బిక్షపతి పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని రాంనగర్ ఎల్బీనగర్ దుంపలగూడెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో బిక్షపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిక్షపతి మాట్లాడుతూ శుక్రవారం ములుగులో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు తెలంగాణ ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని అన్నారు. బడే నాగజ్యోతి గెలిపి లక్ష్యంగా జరుగుతున్న ఈ సభను చూసి ప్రతిపక్షాలు దడుచుకునేలా కదలాలని అన్నారు. ఈ కార్యక్రమం లో ఉద్యమకారుల సంఘం  జిల్లా కన్వినర్ లకావత్ చందూలాల్, మండల అధ్యక్షులు అజ్మీరాసురేష్ బండి రాజశేఖర్, నిమ్మగడ్డ నరేందర్, దర్శనాల సంజీవ, జన్ను రాంబాబు, కొండి రమేష్, జన్ను సుధాకర్, హరిబాబు, సనప కృష్ణారావు, గట్టు ధర్మయ్య, నల్లబోయిన కృష్ణా రావు, సూడి బుచ్చిరెడ్డి తో పాటు సర్పంచ్ మోహన్ రాథోడ్, pacs డైరెక్టర్ సూదిరెడ్డి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.