ప్రో” జయశంకర్ సార్ గొప్ప మహనీయడు..

నవతెలంగాణ – జుక్కల్

ప్రో” జయశంకర్ గొప్ప మహనీయుడని, ఆదర్శ ప్రాయుడని ఖండేభల్లూర్ గ్రామస్తులు అన్నారు. ఆదివారం నాడు ఖండేబల్లూర్  గ్రామములోని గ్రామపంచాయతి కార్యాలయము ఆవరణలో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జీపీ వార్డు సబ్యులతో పాటు బీఆర్ఎస్ నాయకులు,   గ్రామస్తులు పాల్గోన్నారు. అదేవిధంగా జుక్కల్  మండల కేంద్రంలోను నిర్వహించారు.   గ్రామ బీఅర్ఎస్ సీనీయర్ నాయకుడు శివరాజ్  దేశాయి మాట్లాడుతు  ప్రో”జయశంకర్ కలలు కన్న తెలంగాణ చూడలేక పోయారని, ఉద్యమంలో కీలకంగా ఉండి తెలంగాణ పోరాటస్పూర్తిని నింపిన గొప్ప మహనీయుడని, ఇలాంటి వారు దైవస్వరూరులని  పేర్కోన్నారు. అంతకు ముందు ప్రో”జయశంకర్ సార్ చిత్రపఠానికి పూలమాల వేసి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో ఉపసర్పంచ్,  గ్రామ బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గోన్నారు.