ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసిన పురందేశ్వరి..

నవతెలంగాణ- హైదరాబాద్: ఏపీ బీజేపీ చీఫ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి నేడు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై ఆమెకు వినతిపత్రం సమర్పించారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం పురందేశ్వరి ట్విట్టర్ ద్వారా స్పందించారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం ఫలప్రదంగా ముగిసిందని తెలిపారు. “ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న నిధుల మళ్లింపును నిర్మలా దృష్టికి తీసుకెళ్లాను. ప్రభుత్వం విచక్షణ రహితంగా అప్పులు చేసి, ఆ భారాన్ని రాష్ట్రంపై, ప్రజలపై మోపుతున్న వైనాన్ని ఆమెకు వివరించాను. నిర్మలా సీతారామన్ ను నేను కలిసిన ఉద్దేశం నెరవేరింది” అని పురందేశ్వరి పేర్కొన్నారు.

Spread the love