– రాజేంద్రనగర్ సర్కిల్ కమిషనర్ రవికుమార్
నవతెలంగాణ-రాజేంద్రనగర్
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో ప్రధాన రహదారుల్లో వర్షం నిల్వ ఉండకుండా చూడా లని రాజేంద్రనగర్ సర్కిల్ ఉప కమిషనర్ రవికుమార్ శానిటేషన్ అధికారులను ఆదేశిం చారు. శుక్రవారం ఆరాంఘర్, శివరాంపల్లి ప్ర ధాన రహదారిని ఆయన పరిశీలించారు. రెండు రోజు లుగా కురుస్తున్న వర్షానికి వర్షపు నీరు మొత్తం చెరువులు తలపించేలా రోడ్డు మొత్తం నిండిపోయాయి. శుక్రవారం ఉదయం జిహెచ్‌ఎంసీ సిబ్బంది వర్షపు నీటిని అక్కడ నుంచి మళ్లించడంతో తిరిగి వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ రోడ్ల పక్కన ఉన్న నాలాలలోని పూడికతీత ఎప్పటికప్పుడు తీయడం వలన రోడ్డుపై వర్షపు నీరు నిల్వ ఉండే అవకాశం తక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన సర్కిల్ పరిధిలోని చాలా రోడ్లు దెబ్బతిన్నాయని ఆయన అన్నారు. వాహనదారులు వర్షం పడే సమయంలో తగు జాగ్రత్తగా వెళ్లాలని ఆయన తెలిపారు. ఆరాంఘర్‌లో నిల్వ ఉన్న వర్షపు నీరును ప్రత్యేక మోటార్ల ద్వారా అక్కడి నుంచి మొత్తం తీసేసినట్టు తెలిపారు. ఈ పర్యటనలో శానిటేషన్ అధికారి ఆంజనేయులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.