దళితులపై రాజగోపాల్ రెడ్డి చిన్న చూపు

నవతెలంగాణ- చండూరు: దళితులపై కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చిన్నచూపు చూస్తున్నారని, తమని పట్టించుకోవడంలేదని ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆదిమల్ల శంకర్  అన్నారు. బుధవారం మున్సిపల్ కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడారు 2018 జరిగిన ఎన్నికల్లో  కాంగ్రెస్లో ఆయన గెలుపుకు కృషి చేశామన్నారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి  బీజేపీలోకి వెళ్లి  కాంట్రాక్టర్ల పేరుతో  లాభాలు పొందారన్నారు. తిరిగి కాంగ్రెస్ కి రావడంతో   ఆయన  ఎస్సీ సెల్ దళిత నాయకులను, ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. తమని గుర్తించని ఎడల   7 మండలాల్లో, ప్రతి గ్రామంలో   తమ సంఘం ఆధ్వర్యంలో   ఆయన ఓటమికి  సిద్ధమవుతామన్నారు. మళ్లీ బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో ఎమ్మెల్యే అభ్యర్థిగా  నిలబడడం సిగ్గుచేటు అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో దళితులు  కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించాలన్నారు. ఈ కార్యక్రమంలో  ఎస్సీ సెల్ కన్వీనర్ సిరిపంగి శ్రీనివాస్,  మండల అధ్యక్షుడు ఇరిగి  వెంకటయ్య, పట్టణ అధ్యక్షుడు  ఇరిగి శంకర్, మరిగూడెం   మండలాధ్యక్షుడు  ఈసం సుందర్, తిరిగి మల్లేశం, వర్కాల   యాదయ్య, నరసింహ, రాజు, తదితరులు పాల్గొన్నారు.