టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా..

నవతెలంగాణ – ముంబై: వ‌ర‌ల్డ్‌క‌ప్ తొలి సెమీస్‌లో ఇండియా ఫ‌స్ట్ బ్యాటింగ్ చేయ‌నున్న‌ది. న్యూజిలాండ్‌తో వాంఖ‌డే స్టేడియంలో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌కు రోహిత్ సేన ఎటువంటి మార్పులు చేయ‌లేదు. కివీస్ జ‌ట్టు కూడా ఈ మ్యాచ్‌కు ఎటువంటి మార్పులు చేయ‌లేదు. లీగ్ ద‌శ‌లో ఇండియా అన్ని మ్యాచ్‌ల‌ను గెలుచుకున్న‌ది. 9 మ్యాచ్‌ల‌ను గెలిచిన భార‌త జ‌ట్టు 18 పాయింట్ల‌తో అగ్ర‌స్థానంలో ఉన్న విష‌యం తెలిసిందే. ఇక కివీస్ జ‌ట్టు 5 మ్యాచ్‌లు గెల‌వ‌గా, నాలుగింటిలో ఓట‌మి పాలైంది. లీగ్ స్టేజ్‌లో న్యూజిలాండ్‌పై ఇండియా అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. నెట్‌ర‌న్ రేట్‌లోనూ ఇండియానే బెట‌ర్‌గా ఉంది.

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్(సి), డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్(w), మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్

Spread the love