రావమ్మా దీపావళి

Ravamma Diwaliతొలగెనులే సంధ్యావళి
వచ్చేనమ్మ దీపావళి
తెచ్చెనమ్మ శోభావళి
కురిపించే ఉషోదయం
కలిగించే శుభోదయం
మాకు నిలుపు యశోధయం..

ఈ పండుగకు ప్రతీకగా
భారతీయ ఇతిహాసంలో
సత్యభామ చే నరకాసుర వధ…

కానీ! నేటితరం ఆధునికులు
ప్రాచీన చరిత్ర జాతికి మొరటట
సనాతన ధర్మం కరోనా మలేరియా
డెంగ్యూ తో సమానమట
సామాజిక న్యాయం లేదట

ఈనేతల
కొకిబికి తలంపులకు ఛీకొట్టు
కొక్కెరజపాలకు మెలిపెట్టు
పేదరికమును తరిమికొట్టు
అభాగ్యులకు జై కొట్టు

నాయకులకు జడుపు చూపెట్టు
దోపిడీ మూకల భరతంపట్టు
అత్యాచారాలను అరికట్టు
అవనిలో అతివకు రక్షణ మొదలెట్టు
రావమ్మా దీపావళి!
తేవమ్మా శోభావళి ….

దీపాల వరుసల వెలుగువమ్మ
చీకటి వెతలను తీర్చవమ్మ
నీ బిడ్డలను దీవించవమ్మ
నరరూప రాక్షసుల వధించవమ్మ
స్వేచ్ఛ మాకు ప్రసాదించవమ్మ
రావమ్మా ! దీపావళి
తేవమ్మా! ! శోభావళి…

జడమతులను తరలించాలి
జనహితమును పాదుకొల్పాలి
ప్రియమారగ ! సదా మీకు మా
ప్రణతులమ్మా…
– నమిలకొండ భారతి