నవతెలంగాణ – హైదరాబాద్: గుండెపోటు ఆర్టీసీ సీనియర్ కండక్టర్ కన్నుమూశారు. తాండూరు ఆర్టీసీ డీపోలో రేణుక తొలి మహిళా కండక్టర్ గా విధుల్లో చేరారు. బుధవారం రాత్రి 9గంటల సమయంలో ఇంటో కుర్చీలో కూర్చొని ఉండగా ఛాతీ లో నొప్పి వస్తుందని అస్వస్థత కు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆటోలో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. డిపో మేనేజర్ సమత, ఆర్టీసీ సిబ్బంది పార్టివ దేహానికి నివాళులు అర్పించారు.