పారిశుద్ధ్య కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలి

నవతెలంగాణ – తాడ్వాయి
గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ జాన్ వెస్లీ అధికారులను ఆదేశించారు. తాడువాయి మండలం ఎర్ర పహాడ్ గ్రామంలో ఆయన పారిశుద్ధ్య కార్యక్రమాలను అకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామం లో తిరుగుతూ గ్రామంలోని పరిసరాలను పరిశీలించారు. పశువుల తొట్టిలలో చెత్తాచెదారం ఏమైనా ఉందా అనే విషయమై పరిశీలించారు.తొట్టెలు ఎలా ఉపయోగిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలన్నారు రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్య వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డిపిఓ శ్రీనివాస్, డి ఎల్ పి ఓ సాయిబాబా, ఎంపీ ఓ ఎఫ్ సి బారాని ,గ్రామ సర్పంచ్ నరసారెడ్డి, ఉపసర్పంచ్ పడమటి బాలాజీ తదితరు పాల్గొన్నారు