ఉపాధి కూలీలకు వేసవి భత్యం చెల్లించాలి

నవతెలంగాణ – హైదరాబాద్: పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాలి. ఈనెల 20న ఎంపీడీవో కార్యాలయ ముట్టడిని జయప్రదం చేయాలి వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి వత్సవాయి జానకిరాములు. నవతెలంగాణ చింతకాని ఉపాధి హామీ పని ప్రదేశాల్లో టెంటు ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఏర్పాటు చేయాలని అలాగే కూలీలకు వేసవి భత్యం చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి వత్సవాయి జానకి రాములు డిమాండ్ చేశారు. శనివారం మండల పరిధిలోని చింతకాని నరసింహపురం గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పని ప్రదేశాలను వ్యవసాయ కార్మిక సంఘం బృందం సందర్శించింది ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ పే స్లిప్పులు ఇవ్వడం లేదని పనిచేసిన వేతనాలు చెల్లించడం లేదని వ్యవసాయ కార్మిక సంఘం బృందానికి మొరపెట్టుకున్నారు. సమస్యలపై ఈ నెల 20వ తేదీన చింతకాని ఎంపీడీవో కార్యాలయం ఎదుట జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని జానకి రాములు కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు దేశబోయిన ఉపేందర్ నాయకులు గడ్డం కోటేశ్వరరావు కూలీలు పాల్గొన్నారు.

Spread the love