‘సామాజిక విప్లవకారుడు సర్వాయి పాపన్న’

పీడితులు, బహుజనులు ఏకమై పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించిన పోరాట యోధుడు, సామాజిక విప్లవకారుడు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌. కుల, మత, జాతి వర్గ విభేదాలు లేని సమాజం కోసం దాదాపు 350ఏండ్ల కిందనే కృషి చేసిన నాయకుడాయన. ఆధిపత్య అగ్రకుల పాలకులు బహుజనులను అణగ దొక్కుతున్న 17వ శతాబ్దంలోనే స్వీయ సైన్యంతో దక్కన్‌పై తొలి బహుజన రాజ్య స్థాపన చేసిన గొప్ప వీరుడు. మహాత్మా జ్యోతిరావు పూలే కంటే ముందే సామాజిక న్యాయం అమలు చేసిన గొప్ప సామాజిక విప్లవకారుడు. రాచరికపు వ్యవస్థ నీడలో అగ్రకులాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా, జమీందార్లు, జాగీర్దాల అరాచకాలను సహించలేక కడుపు మండి కత్తి పట్టిన ధీరుడతడు. ఖిలాషాపూర్‌ను కేంద్రంగా చేసుకొని మొఘలుల ఆధిపత్యాన్ని ఎదిరించి గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన బహుజన చక్రవరి. పాపన్న ఉమ్మడి వరంగల్‌ (జనగామ)జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపూర్‌ గ్రామంలో ధూళ్మిట్ట శాసనం ప్రకారం 18 ఆగస్టు 1650లో జన్మించాడు. బాల్యంలో పశువులను కాస్తూ ఆనాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్ధితులు గమనిస్తూ స్నేహితులతో చర్చించేవాడు. దీంతో చిన్నతనం నుంచే ఆధిపత్య బ్రాహ్మణ భావజాల వ్యతిరేక బీజాలు పాపన్నలో ఏర్పడ్డాయి. తల్లి కోరిక మేరకు గౌడ వృత్తిని స్వీకరించాడు. కానీ బహుజన రాజ్యం కోసం పోరడతానని తల్లితో ప్రతిజ్ఞ చేశాడు. పాపన్న ఎక్కువగా ఇతర కులాల వారితో కలిసి తిరిగేవాడు. వీరిలో చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాళ్లు, దూదేకుల పీరు, కొత్వాల్‌ మీరు సాహేబ్‌ పాపన్న ప్రధాన అనుచరులేగాక వీరంతా బహుజనులు. ఆయన ముస్లిం మతానికి చెందిన ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె భువనగిరి కోట ఫౌజ్దార్‌ (మిలిటరీ గవర్నర్‌) సోదరి. తెలంగాణలో మొఘల్‌ రాజుల ఆధిపత్యాన్ని అంతం చేయాలని, తాబేదారులు, జమీనుదారులు, జాగీర్దారులు, దొరలు, భూస్వాములు చేసే దురాగతాలను గమనించి బానిసత్వ విముక్తి కల్పించాలని గోల్కొండ కోటపై బహుజనుల జెండా ఎగురవేయాలని నిర్ణయించాడు పాపన్నకు ఎలాంటి వారసత్వ నాయకత్వం కాని, ధనంకాని, అధికారం కాని లేవు. పన్నెండు వేల మందితో గెరిల్లా సైన్యాన్ని, మూడు వేల మందితో పదాతి దళాలు, ఐదు వందల మందితో రక్షకదళాలను ఏర్పాటు చేసుకున్నాడు. దళిత, గిరిజనులను చేరదీసి వారికి యుద్ధ విద్యలను నేర్పాడు. మొగలుల సైన్యంపై తన సైన్యంతో దాడిచేసి తన సొంత ఊరు ఖిలాషాపూర్‌ని రాజధానిగా చేసుకుని 1675లో సర్వాయిపేటలో తన రాజ్యాన్ని స్థాపించాడు. ఛత్రపతి శివాజీకి సమకాలికుడు పాపన్న. ముస్లింల పాలన అంతానికి మహారాష్ట్రలో శివాజీ ఎలాగైతే పోరాడాడో, పాపన్న కూడా తెలంగాణలో మొగలుల పాలన అంతానికి పోరాడారు. 1687-1724 వరకు మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు సైన్యానికి వ్యతిరేకంగా ఉద్యమించాడు. పాపన్న ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించి విజయ దుర్గాలు, కోటలు 21వరకు నిర్మించాడు. 1678 వరకు తాటికొండ, వేములకొండలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. అతని సామ్రాజ్యం తాటికొండ, కొలనుపాక, చేర్యాల నుండి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని హుస్నాబాద్‌, హుజూరాబాద్‌ వరకు విస్తరించింది. కనుచూపు మేరలో శత్రువులను కనిపెట్టెలా కోటలు నిర్మించాడని చరిత్రకారుల విశ్లేషణ.ఆధునిక ఆయుధాలు కూడా ఉపయోగించినట్లు చారిత్రక ఆనవాళ్లు లభించాయి. కోటకు నాలుగు వైపులా బురుజులు, మధ్యలో ఎత్తైన మరో బురుజు, దాని నుంచి మరో బురుజు వైపు నడిచి వెళ్లేందుకు సరిపడా వెడల్పైన స్థలం ఉండేలా నిర్మించాడు. శత్రువులను ఎదుర్కొనేందుకు వీలుగా కోటగోడపై పిట్టగోడలకు అనువైన రంధ్రాలు, ఈ కోట నుంచి బయటకు వెళ్లేందుకు మూడు సొరంగాలను, కోటలను శత్రువులకు అంతు చిక్కకుండా కట్టించాడు.
1700-1705 మధ్యకాలంలో ఖిలాషాపురంలో మరొక దుర్గం నిర్మించాడు. ఒక్కోమెట్టూ ఎక్కుతూ చివరకు గోల్కొండ కోటను స్వాధీనపర్చుకున్నాడు. మొగలు రాజు పాపన్న పరాక్రమాన్ని గుర్తించి గోల్కొండ ప్రభువుగా ప్రకటించాడు. ఆయన ఏడు నెలలపాటు అధికారం చెలాయించాడు. పాపన్న ఆలోచనలకు బెంబేలెత్తిన భూస్వాములు, మొగలుల తొత్తులైన నిజాములు, కుట్రలు పన్ని సైన్యాన్ని బలహీనపర్చే ప్రయత్నం చేశారు. ఒక సామాన్య గీత కార్మికుడు గోల్కొండ ప్రభువుగా ఉండటం గిట్టని అగ్రకుల ఆధిపత్య వర్గాలు ఢిల్లీ బహుదూర్‌షాకు పాపన్నపై అసత్య ప్రచారాలు చేశారు. పాపన్న ప్రయత్నాన్ని ద్వంద్వ తిరుగుబాటుగా అభివర్ణించారు అగ్రవర్ణ చరిత్రకారులు. దోపిడీదొంగగా చిత్రీకరించారు. ఆ విషయాలు నమ్మిన ఢిల్లీ బహదూర్‌షా పాపన్న సైన్యంపై దాడి చేసి ఆరునెలలు పోరాడినట్లు సమాచారం. యుద్ధం జరుగుతున్న రోజుల్లోనే (1710)లో ఓ రోజు రాత్రి పాపన్న ఉద్యమద్రోహి చేత పట్టుపడినట్టు, కొద్దిరోజుల తర్వాత పాపన్నను ఉరితీసి మృతదేహాన్ని ముక్కలుగా చేసి తలను ఢిల్లీకి పంపారని చరిత్రకారులు రిచర్డ్స్‌, హనుమంతరావులు తెలిపారు. చరిత్రను వక్రీకరించొచ్చు కానీ ప్రజల హృదయాల్లో సంపాదిం చుకున్న పాపన్న స్థానాన్ని ఎవరూ చెరపలేరు. మొగలు ప్రభువుల అరాచకాలకు, మతఛాందస విధానాలకు వ్యతిరేకంగా దాదాపు ఇరవై ఏండ్లపాటు పోరాడిన మహాపోరాట యోధుడు. బహుజన రాజ్య విస్తరణకు(ఓరుగల్లు నుండి గోల్కొండ వరకు) కృషి చేసిన వీరుడు. ఆయన మరణించినా పాపన్న చరిత్రను వీరగాదలుగా, జానపద కళా రూపాల ద్వారా ఊరురా చెప్పేవారు. పాపన్న ఆశయ సాధనలో పాలుపంచుకోవడమే ఆయనకు మనమిచ్చే నివాళి.
(నేడు సర్వాయి పాపన్న 373వ జయంతి)
– పాకాల శంకర్‌ గౌడ్‌, 9848377734

Spread the love
Latest updates news (2024-05-20 12:15):

smilz cbd mfA gummies tucker carlson | L5I strong cbd gummies for pain | hemp cAz bombs high potency cbd gummies | rockstar cbd dkh infused sour gummies | cbd gummies by dr gupta VfP | 0OH leva cbd gummies review | cbd ksa gummy for tinnitus | smilz 4P9 cbd gummies bbb | soothe nano TNF cbd gummies | how much cbd gummies should rkq i take canada | Fce just cbd gummies brand | cbd gummies JNi rainbow ribbions | 5 p0g cbd gummy bears for 20 dollars | can tSO i take cbd gummies on an empty stomach | koi tropical cbd 08z gummies | provida free shipping cbd gummies | jolly cbd gummies xIv to help quit smoking | y7J oprah winfrey and cbd gummies | charlottes webb ELh cbd gummies | cbd gummies low ams sugar | is it legal to bring kCx cbd gummies on a plane | counts custom RJG cbd gummies | halkon cbd gummies for sale | cbd gummies puerto rico Opx | experience cbd gummies f2e reviews | cbd GQn gummy got me kind of high | cbd gummies free trial effective | shop for cbd gummies 9TU | cbd gummies legal age fK0 | jMc cbd gummies with thc where to buy | highly edible cbd gummies review 7PL | cbd gummies for pain at walgreens oGG | cbd 9a6 gummies college station tx | cbd gummies positive for thc drug yHO screen | 4mR cbd gummy recipe coconut oil | buy cbd Ksj gummies in uk | how to buy cbd 0DX gummies from shark tank | natures one brand xsM cbd gummies | swag brand cbd xnC gummies | anxiety cbd only gummies | lifestream idU cbd gummies review | EQV h pure cbd gummies | 500mg cbd gummies zemi F2s worms | can cbd gummies IAb help lower blood pressure | o2Q cbd gummies for copd reviews | Afe does cbd gummies make you hungry | do cbd l9I gummies work for smoking | which cbd gummy is best for anxiety Qvu | cbd gummies far 9Xx and away | zto who sell cbd gummies near me