పార్ట్‌టైం జాబ్ పేరుతో రూ. 31 ల‌క్ష‌లు ముంచిన‌ స్కామ‌ర్లు

నవతెలంగాణ- న్యూఢిల్లీ: పోలీసులు, ప్ర‌భుత్వం సైబ‌ర్ నేరాల‌పై ఎంత‌గా అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నా రోజుకో స్కామ్‌తో సైబ‌ర్ నేర‌గాళ్ల ఆగ‌డాలు శృతి మించుతున్నాయి.  బీమా కంపెనీ రిటైర్డ్ ఉద్యోగిని టార్గెట్ చేసిన స్కామ‌ర్లు 58 ఏండ్ల బాధితుడిని బురిడీ కొట్టించి రూ. 31 లక్ష‌లు దోచేశారు. పార్ట్ టైం జాబ్ ఆఫ‌ర్ పేరుతో స్కామ‌ర్లు న‌మ్మ‌బ‌ల‌క‌డంతో బాధితుడు త‌న పెన్ష‌న్‌, గ్రాట్యుటీ స‌హా క‌ష్టార్జితం మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం పార్ట్‌టైం జాబ్ పేరుతో బాధితుడికి టెలిగ్రాం మెసేజ్ రావ‌డంతో పార్ట్‌టైం జాబ్ చేసేందుకు బాధితుడు అంగీక‌రించాడు. ఇక యూట్యూబ్ వీడియో లింక్స్‌ను పంపిన స్కామ‌ర్ వాటిని లైక్ చేయ‌డం ద్వారా క‌మిష‌న్ పొంద‌వ‌చ్చ‌ని మ‌భ్య‌పెట్టాడు. తొలుత కొన్ని వీడియోల‌ను బాధితుడు లైక్ చేయ‌డంతో వాటికి క‌మిష‌న్ అందుకున్నాడు.

Spread the love